ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని మిగతా దేశాలు అభిప్రాయపడుతున్నాయి.అక్టోబర్ 7వ తారీకు మొదలైన ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న దాడులను ఆపాలని ఖండిస్తూనే ఉన్నాయి.కొద్ది రోజుల క్రితం అరబ్ దేశాల నాయకులు సౌదీ అరేబియాలో సమావేశమై. ఇజ్రాయెల్ కు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది.గాజాలో ఇజ్రాయెల్ బలగాలు వెంటనే వెనక్కి పంపించాలని సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది నాయకులు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్ సైన్యంతో జరిగిన పోరాటంలో హమాస్ కు చెందిన కీలక నేతలు దాదాపుగా నేలమట్టం అయ్యారు. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన చేసింది. ఫలితంగా హమాస్ సైన్యానికి మార్గదర్శకం చేసేవారు లేక హమాస్ మిలిటెంట్లు నెమ్మదించే అవకాశం ఉంది. మరోవైపు సామాన్యులను అడ్డుపెట్టుకుని గాజాలోని ఆస్పత్రులను ఆధీనంలోకి తీసుకుని ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోందని హమాస్ విమర్శిస్తోంది. పాలస్తీనా అధీనంలోని హమాస్ గాజాలో ఇజ్రాయెల్ దళాలు తమ దేశపు జెండాలు ఎగరేయటం హమాస్ కొసమెరుపు.
మరికొన్ని రోజులు ఇదే రీతిలో యుద్ధం చేసి గాజా మొత్తాన్ని ఇజ్రాయెల్ తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశాలున్నాయి.
కానీ మరో పక్క యుద్ధం ముగింపే లక్ష్యంగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య కీలక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ దిశగా రెండు వర్గాల మధ్య అంగీకారం కుదిరినట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. అందులో భాగంగా 5 రోజుల పాటు దాడులు చేయబోమని ఇజ్రాయెల్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు 70 మంది బందీలను విడుదల చేసేందుకు హమాస్ సిద్ధమవగా.. తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా వాసులను విడిచిపెట్టేందుకు ఇజ్రాయిల్ అంగీకరించింది.