అమితాబ్ బ‌చ్చ‌న్ చ‌నిపోయాడంటూ ప్ర‌చారం.. వీళ్లు ఇక మార‌రా..?

-

సోష‌ల్ మీడియా జ‌నాల‌కు ఎంత ఉపయోగ‌ప‌డుతుందో అంద‌రికీ తెలిసిందే. కానీ కొంద‌రు ప్ర‌బుద్ధులు మాత్రం దాన్ని ఫేక్ వార్త‌ల‌ను ప్ర‌చారం చేయ‌డానికే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. ఇక ఈ మ‌ధ్య కాలంలోనైతే సోష‌ల్ మీడియాలో ఫేక్ వార్త‌లు బాగా వ‌స్తున్నాయి. దీంతో జ‌నాల‌కు అస‌లు వార్త ఏదో, ఫేక్ వార్త ఏదో న‌మ్మబుద్ది కావడం లేదు. తాజాగా బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ చ‌నిపోయాడంటూ… ఓ ప్ర‌బుద్ధుడు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం మొద‌లు పెట్టాడు. అయితే అది ఫేక్ వీడియో అని తేలింది.

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ చ‌నిపోయారంటూ.. టిక్‌టాక్‌లో ఓ వ్య‌క్తి ప్ర‌చారం మొద‌లు పెట్టాడు. అందులో ఓ వీడియోను కూడా అత‌ను ఉంచాడు. ఆ వీడియోలో అమితాబ్ బ‌చ్చ‌న్ హాస్పిట‌ల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న‌ట్లుగా ఉంది. అనంత‌రం ఓ వాహ‌నంలో అమితాబ్ కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్ దిగుతూ క‌నిపిస్తున్నాడు. దీంతో ఆ వీడియోను చాలా మంది నిజ‌మే అని న‌మ్మారు. అమితాబ్ నిజంగానే చ‌నిపోయాడ‌ని అనుకున్నారు. ఇటీవ‌లే బాలీవుడ్‌కు చెందిన ఇద్ద‌రు ప్ర‌ముఖ న‌టులు ఇర్ఫాన్ ఖాన్‌, రిషిక‌పూర్‌లు చ‌నిపోయిన నేప‌థ్యంలో… అమితాబ్ కూడా చ‌నిపోయి ఉంటార‌ని చాలా మంది జ‌నాలు నమ్మారు. కానీ ఆ వార్త ఫేక్ అని తేలింది.

 

ఇక ఆ వీడియోపై ఓ వ్య‌క్తి స్పందించి సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు కంప్లెంయింట్ చేశాడు. అనంత‌రం త‌న ఫిర్యాదు ప‌త్రాన్ని ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. అలాగే ఆ వీడియోను పోస్ట్ చేసిన టిక్‌టాక్ యూజ‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అత‌న్ని అరెస్టు చేయాల‌ని, అత‌ని ఐడీని బ్లాక్ చేయాల‌ని.. కంప్లెయింట్ ఇచ్చిన వ్య‌క్తి ట్విట్ట‌ర్‌లో కోరాడు. దీంతో ఇప్పుడీ విషయం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version