కరోనా వైరస్ దెబ్బకి పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అదేవిధంగా మందుబాబులు కూడా అనేక అవస్థలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ అయిపోయాయి. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా మందు లేకపోవడంతో చాలా మంది అలవాటు పడిన వాళ్ళు మానసిక రోగాలతో బాధ పడుతున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక నష్టం చాలా ఎక్కువగా ఉండటంతో జగన్ కూడా…మద్యం అమ్మకాల విషయంలో గత పాలసీని అనుసరించకుండా ఉండాలని సరి కొత్త పాలసీ తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు టాక్. ఒకవిధంగా చూసుకుంటే మద్యం షాపులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఓపెన్ చేయడానికి జగన్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇది వాస్తవం అయితే ఆంధ్రప్రదేశ్ మందుబాబులకు ఇది మంచి కిక్ ఇచ్చే వార్త అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.