తెలుగు రాష్ట్రాల సమస్యలు… జాతీయ సమస్యలు : అమిత్ షా

-

సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలపై తమ తరపు డిమాండ్లను వినిపించారు. అయితే దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలపై.. తమకు అవగాహన ఉందని అమిత్షా పేర్కొన్నారు.

amith sha

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ఆ రాష్ట్రాలు ఏవి కాదని అవి జాతీయ సమస్యలు అని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్ర సమస్యలపై జగన్ ప్రస్తావించిన అంశాలను తాము పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంశాలన్నిటినీ తప్పకుండా పరిష్కారం చూపుతామని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దీనిపై రెండు రాష్ట్రాలు… ఎలాంటి ఆందోళన చెందవద్దని.. రెండు రాష్ట్రాలకు సమ న్యాయం చేస్తామన్నారు అమిత్ షా.  విభజనతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని.. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదని అంతకు ముందు జగన్ పేర్కొన్నారు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి వీటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version