Aishwarya Rai: మ‌రోసారి త‌ల్లి కాబోతున్న మాజీ ప్ర‌పంచ‌ సుంద‌రీ! నెట్టింట వైర‌లవుతున్న వీడియో

-

Aishwarya Rai: మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల్సిన అవ‌స‌రం లేదు. త‌న అందం, అభిన‌యంతో దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను సంపాదించుకుంది. త‌న కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే.. అభిషేక్ బ‌చ్చ‌న్ ను పెళ్లి చేసుకుని బ‌చ్చ‌న్ ఇంటి కోడ‌ల‌య్యింది. పెళ్లి త‌రువాత‌.. కూడా ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ.. మెప్పిస్తుంది. అయితే.. తాజాగా ఆమె గురించి నెట్టింట్లో ఓ ఆసక్తిక‌ర అంశం వైర‌లవుతుంది. మాజీ ప్ర‌పంచ సుంద‌రి మరోసారి గర్భవతి అయ్యిందా? అంటూ నేష‌న‌ల్ మీడియాలో వార్త చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఈ క్ర‌మంలో తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్య.. త‌న భర్త అభిషేక్‌, కూతురు ఆరాధ్యలతో కలిసి మీడియా కంటపడ్డారు. ఈ సమయంలో ఐష్ త‌న పొత్తి క‌డుపు క‌నిపించ‌కుండా డ్రెస్సింగ్ చేసుకున్న‌ది. అంతే కాకుండా త‌న హ్యాండ్ బ్యాగ్ తో త‌న పొట్ట భాగాన్ని క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. దీంతో మరోసారి ఐశ్వ‌ర్య తల్లి కాబోతున్న అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతుంది. ఈ విష‌యంపై ఐశ్వర్య కాని, బచ్చన్‌ ఫ్యామిలీ కానీ ఈ విషయంపై స్పందించలేదు. కానీ ఎయిర్ పోర్టులో ఐష్ బెల్లీ కవర్ చేస్తున్న వీడియో మాత్రం వైరల్ గా మారుతుంది.

బ‌చ్చ‌న్ అభిమానులు మాత్రం.. ఔవును నిజ‌మే.. వార‌సుడు రాబోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐష్, అభిషేక్ బచ్చన్ లకు ఇప్పటికే ఆరాధ్య అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే.
ఐష్ తల్లైన తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్‌ కొత్త సినిమాలు కూడా ఏమీ కమిట్‌ కాకపోగా.. ప్ర‌స్తుతం మణిరత్నం దర్శకత్వంలో హిస్టారికల్‌ ఫిక్షన్‌ స్టోరీ ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో మాత్రమే నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version