అమృత, ప్రణయ్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేర్ల తెలియని వారు ఉండరు. ప్రేమించి పెళ్లాడినందుకు కిరాతకంగా ప్రణయ్ చంపివేయబడ్డాడు. మిర్యాలగూడలో పరువు హత్యకు దారి తీసిన ఈ ప్రేమ ఉదంతాన్ని తెలుగు రాష్ట్రాల జనాల మదిలో అలాగే ఉంది.ప్రణయ్ హత్య తరువాత విషం తాగి అమృత తండ్రి చనిపోవడం ఆ తరువాత జరిగిన పరిణాామాలు అందరికి తెలిసినవే.. అయితే అమృత ఇప్పుడిప్పడే ఆ బాధ నుంచి బయటపడుతోంది. ఈ క్రమం లోనే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది.
అడపాదడపా ఇన్ స్టా రీల్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా యాంకర్ లాస్యతో కలిసి అమృత ఓ పాటలో నటించింది, ఆమె యాంకర్ లాస్యతో కలిసి చేసిన కవర్ సాంగ్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. అమృత, లాస్య అందంగా ముస్తాబైన ఫోటోలు వైరల్ గా మారడంతో.. పలువురు నెటిజెన్లు వారికి తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు.