KPHBలో రికార్డు స్థాయి ధర పలికిన ఎకరం భూమి…ఎంతంటే

-

ఎకరం భూమి రూ.70 కోట్లుగా పలుకుతోంది. హైదరాబాద్-కేపీహెచ్‌బీలో రికార్డు స్థాయి ధర పలికింది ఎకరం భూమి. హౌసింగ్ బోర్డ్ అధికారులు కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లో 7.50 ఎకరాలను బుధవారం వేలం వేశారు. అందులో ఎకరం రూ.70 కోట్లకు దక్కించుకుంది గోద్రెజ్ ప్రాపర్టీ సంస్థ.

kphb
An acre of land sold for a record price in KPHB

తద్వారా హౌసింగ్ బోర్డుకు 547 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించింది. అటు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ స్వగృహ ప్లాట్లను లాటరీ పద్దతిలో తెలంగాణ ప్రభుత్వం అమ్ముతోంది. పోచారం టౌన్ షిప్ లో ఉన్న 2 టవర్ల లోని 194 ప్లాట్లు.. గాజులరామారం టవర్ లోని 112 ప్లాట్లు లాటరీ విధానంలో కేటాయించారు. రాజీవ్ స్వగృహ ప్లాట్ల ద్వారా రూ.70.05 కోట్లు అర్జించింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news