చాణక్య నీతి అపారమైన జ్ఞానానికి, దూర దృష్టికి ప్రసిద్ధి చెందింది. చాణక్యుడు తన అర్థశాస్త్రంలో కేవలం రాజనీతి గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయంలో ఆర్థిక విజయాలకు సంబంధించిన అనేక సూత్రాలను వివరించాడు. చాలామంది ప్రజలు ధనవంతులు కావాలని కలలు కంటారు. కానీ కొన్ని తప్పులు వారిని ఆ లక్ష్యం నుంచి దూరం చేస్తాయి. చాణిక్యుడు చెప్పిన ఈ తప్పులు అర్థం చేసుకొని వాడిని సరిదిద్దుకోవడం ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరవచ్చు. మరి ధనవంతులు కాకుండా అడ్డుకునే కొన్ని ప్రధాన తప్పులు గురించి తెలుసుకుందాం..
సోమరితనం: సోమరితనం అనేది ఒక వ్యక్తిని నాశనం చేసే ప్రధాన శత్రువు అని చాణక్యుడు చెప్పాడు. ఒక పనిని రేపటికి వాయిదా వేయడం అనేది ఆర్థిక పురోగతికి అతిపెద్ద అడ్డంకి. ఏ పని నైనా అది చిన్నదైనా, పెద్దదైనా సకాలంలో పూర్తి చేయాలి. సోమరితనం వల్ల మంచి అవకాశాలను కోల్పోతారు సంపదను పెంచుకోలేరు. కష్టపడి పని చేయడం, చురుగ్గా ఉండడం సంపదను కాపాడుకోడానికి మొదటి మెట్టు.
అనవసరమైన ఖర్చులు : ఈ రోజుల్లో ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి ఎంత డబ్బు వచ్చినా నిలబడట్లేదు చాణక్యుడు ఆర్థిక ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. అనవసరమైన వస్తువులకు డబ్బు ఖర్చు చేయడం అప్పు లలో మునిగిపోవటం, సంపదను నాశనం చేస్తాయి. మనం సంపాదించిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేయాలి, పొదుపు చేయాలి, తెలివైన పెట్టుబడులు పెట్టాలి అప్పుడే సంపద పెరుగుతుంది.

భవిష్యత్తు గురించి: చాణక్యుడు భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించాడు. కేవలం వర్తమానం గురించి ఆలోచించి, భవిష్యత్తు కోసం పొదుపు చేయకపోవడం ధనవంతులు కాకుండా అడ్డుకుంటుంది కష్టకాలంలో మనల్ని ఆదుకోవడానికి ఒక ఆర్థిక నిధి ఉండాలి భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం చాలా ముఖ్యం.
ఎవరైతే తమ ఆదాయాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలమైతే వారు పేదరికంలో వుంటారని చాణిక్య నీతి చెబుతుంది. జూదం, మద్యం లాంటి వ్యసనాలకు బానిసైతే పేదరికంలో మునిగిపోతారు. సరైన విద్య సరైన నైపుణ్యాలు లేకపోయినా ఉపాధి దొరకకపోయినా ఆర్థిక కష్టాలు ఎదుర్కోక తప్పదు.
ఈ తప్పులను నివారించి చానిక్యుడు సూచించిన మార్గంలో నడవడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. కష్టపడి పని చేయడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తు కోసం ప్రణాళికలను రూపొందించుకోవడం అనేవి ఆర్థిక విజయానికి మూల స్తంభాలు.