నిర్మల్ కలెక్టరేట్లో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి రాసలీలలు ఒక్కసారిగా వెలుగుచూశాయి.ఓ యువతితో సదరు ఉద్యోగి రాసలీల లాడుతూ పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది. నిర్మల్ శివారులోని ఓ వెంచర్లో నిర్మించిన ఇంట్లో సదరు ఉద్యోగితో పాటు ఓ యువతి రహస్యంగా కలుసుకున్నారని ఫిర్యాదు రావడంతోనే వెంటనే ఘటనా స్థలానికి నిర్మల్ రూరల్ పోలీసులు చేరుకున్నారు.
పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలియడంతోనే యువతిని గదిలోనే ఉంచి తాళం వేసి సదరు ఉద్యోగి పరారైనట్లు సమాచారం.దీంతో తాళం పగులగొట్టి యువతిని గదిలో నుంచి బయటికి తీసుకొచ్చి పూర్తి వివరాలు సేకరించి ఆమెను వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో కలెక్టరేట్లో కీలక బాధ్యతల నుంచి సదరు ఉద్యోగిని ఉన్నతాధికారులు తప్పించినట్టు సమాచారం. ఈ విషయం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.