సమాజంలో ఆడ పిల్లల విషయంలో ఇంకా చిన్న చూపు ఉన్న సంగతి తెలిసిందే. చిన్న పిల్లల విషయంలో కూడా తల్లి తండ్రులు కొందరు కనికరం లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. తాజాగా విశాఖ జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని యాసిడ్ తాగించిన కసాయి భర్త కథ ఇది. ఆడపిల్ల పుట్టిందని బెదిరించి వాటర్ బాటిల్ లో యాసిడ్ కలిపి భర్త తాగించాడు.
గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో అపర్ణ మంచాన పడింది. ఆసుపత్రిలో జాయిన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. భర్త గంగునాయుడు అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ బంధువులు, మాదిగ రాజకీయ పోరాట సమితి కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.