ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల సంఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా.. ఇదే పరిస్థితి నెలకొంది. పెళ్లి అయినా సరే… వేరే అమ్మాయి లేదా వేరే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. ఇక తాజాగా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న తరుణంలోనే.. యువతిని చితకబాదింది భార్య. ఈ సంఘటన ఏపీలో కలకలం రేపుతోంది.

తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఓ యువతిని భార్య చితకబాదిన ఘటన అనకాపల్లి (D) నర్సీపట్నంలో జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ లో నిన్న రాత్రి నడిరోడ్డుపై చితక్కొట్టింది. తన భర్తకు దూరంగా ఉండాలని ఎంత చెప్పినా సదరు యువతి వినడం లేదని ఆమె చెప్పింది. చుట్టుపక్కల వారు వారించినా వినకుండా దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో స్థానికంగా వైరలవుతోంది.
భర్తతో అక్రమ సంబంధం.. యువతిని చితకబాదిన భార్య
తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఓ యువతిని భార్య చితకబాదిన ఘటన అనకాపల్లి (D) నర్సీపట్నంలో జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ లో నిన్న రాత్రి నడిరోడ్డుపై చితక్కొట్టింది. తన భర్తకు దూరంగా ఉండాలని ఎంత చెప్పినా సదరు యువతి… pic.twitter.com/fHJgo0IKNr
— ChotaNews App (@ChotaNewsApp) September 14, 2025