తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబానికి అవమానం

-

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబానికి అవమానం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు చాకలి ఐలమ్మ పేరు వాడుకొని ఓట్లు దండుకున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఐలమ్మ మనవడికి అనారోగ్యంతో ఉంటే సరైన వైద్యం కూడా అందించలేక పోయాడని మండిపడుతున్నారు. ప్రజాపాలనలో భాగంగా చాకలి ఐలమ్మ కుటుంబం సీఎం రేవంత్‌ అపాయింట్మెంట్ కోసం మూడు, నాలుగు సార్లు ప్రయత్నించినా, ప్రజా సంఘాల నాయకులు ఐలమ్మ మనవడికి సరైన వైద్యం అందించమని వేడుకున్న సీఎం పట్టించుకోలేదని తెలుస్తోంది.

ఫలితంగా చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల రామచంద్రం మృతి చెందాడని గ్రామస్తులు చెబుతున్నారు. కనీసం పాలకుర్తి ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదని, చాకలి ఐలమ్మ మనవరాలికి మహిళా కమిషన్ సభ్యురాలి పోస్టు ఇస్తానన్న రేవంత్.. ఇప్పటివరకు దాని ఊసే ఎత్తలేదని ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news