సికింద్రాబాద్ లాలాగూడలో జంట హత్యల కలకలం రేపుతున్నాయి. లాలాగూడలోని ఓ ఇంటి సంపులో మహిళ మృతదేహం తెరపైకి వచ్చింది. మృతురాలు జ్ఞానేశ్వరి (45)గా గుర్తించారు పోలీసులు. జవహర్‌నగర్‌లో జ్ఞానేశ్వరి తల్లి హత్యకు గురైంది. ఈ తరుణంలోనే…. ఇద్దరినీ అరవింద్, లక్ష్మి కలిసి హత్య చేసినట్టు గుర్తించారు జవహర్ నగర్ పోలీసులు.

అటు లక్ష్మిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్యల గురించి విషయాలు బయటపడ్డాయి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని తల్లి, కూతురును హత్య చేశాడట అరవింద్. ఇక వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని తల్లి, కూతురును చేసి… యూపీకి పరార్ అయ్యాడు అరవింద్. దీంతో అరవింత్ కోసంపోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.