ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే వారం నుంచి ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మరో వారంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమం చేపడతామని.. అర్హులైన వారిని ఎంపిక చేసి, పనులు మొదలు పెడతామని ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

అయితే.. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోలా మాట్లాడారు. సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే 74% పూర్తయిందని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అక్టోబర్ పోయింది, డిసెంబర్ పోయింది, సంక్రాంతి పోయింది.. ఇప్పుడు సంక్రాంతి తర్వాత అంటున్నారని అప్పట్లోనే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు మరో వారం రోజుల్లోనే అంటూ ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.