వారాహి యాత్రలో భాగంగా పవన్ ఆదివారం అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకువచ్చేదని.. ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకువస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ‘కోడి గుడ్డు పెట్టింది. ఇంకా పొదుగుతోంది. ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ సీఎంను ఇచ్చింది. 5 శాఖలకు మంత్రిని చేస్తే.. ఒక్క కిలోమీటర్ రోడ్డు వేయలేదు. మా కూటమి గెలవగానే.. అనకాపల్లి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తాం అని అన్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తాం’ అని వెల్లడించారు.
సీఎం జగన్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.’అమ్మ ఒడి పథకం ఎంతమంది పిల్లలున్నా వేస్తామని చెప్పి.. 83 లక్షల మంది లబ్ధిదారుల్లో 44 లక్షల మందికే ఇచ్చారు అని ఆరోపించారు .రూ.19,600కోట్లు అమ్మఒడికి ఇచ్చి.. మద్యం అమ్మి నాన్న తడి పథకం కింద రూ. లక్ష కోట్లు దోచేసిన సారా వ్యాపారి జగన్ అని మండిపడ్డారు. మనకి ఈ కోడిగుడ్డు ప్రభుత్వం, కోడిగుడ్డు మంత్రి వద్దు’ అని అనకాపల్లి సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.