ప్రకృతికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది: ఆనంద్ మహీంద్రా

-

ప్రస్తుతం ముంబై నగరం భారీ వర్షాలకు తడిసి ముద్దయింది. మహారాష్ట్రలో ఓ పక్క కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే… మరో పక్కన భారీ వర్షాలతో మరింత అతలాకుతలమవుతోంది. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. కేవలం వర్షం మాత్రమే కాకుండా గంటకు 100 మైళ్ళ వేగం కంటే ఎక్కువ వేగంతో బలమైన గాలులు వీస్తుండడంతో అనేకచోట్ల ఇంటి పైకప్పు లతో పాటు అనేక పెద్ద వృక్షాలు సైతం నేల రాలుతున్నాయి. ఈ పరిస్థితిని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు.

Anadh mahendra

ఇక ఆ ట్విట్టర్లో ఓ వీడియోని జతచేస్తూ ‘బలంగా వీస్తున్న గాలులకు ఆ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టు అటూ ఇటూ ఊగడం చూస్తే… నాకు అవి డాన్స్ చేస్తున్నట్లు గా అనిపించాయి అని తెలుపుతూ, ప్రకృతికి కోపం వస్తే ఎంతటి విధ్వంసాలు జరుగుతాయో అనిపించిందని తెలియజేశారు. అయితే మొత్తానికి ముంబైలో కురిసిన భారీ వర్షాలు వినిపిస్తున్నాయని వణికిస్తున్నాయని తెలిపాడు. అయితే నెటిజన్లు షేర్ చేసిన అన్ని వీడియో లలో కంటే ఈ వీడియో కాస్త మోస్ట్ డ్రమెటిక్ వీడియోగా నిలిచిందని’ ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నిజంగా ప్రకృతి కన్నెర్ర చేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రస్తుతం ముంబై నగరాన్ని చూస్తే అర్థమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version