ఆనందయ్య మందు గురించి ప్రత్యేకమైన పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఆనందయ్య నాటు మందుతో కరోనా తగ్గిపోతుందన్న వార్త దేశమంతటా పాకి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రప్రభుత్వాన్ని కృష్ణపట్నం వైపు చూసేలా చేసింది. ఐతే మందు పంపిణీ విషయంలో ఎన్నో చర్చలు, వివాదాలు జరిగాయి. తాజాగా ఆనందయ్య మందుని ఒంగోలులో పంపిణీ చేయనున్నారు. ఎంపీ మాగుంట, ఆయన కుమారుడి చేతుల మీదుగా జనాలకి పంపిణీ చేయనున్నారు.
ఉదయం 9గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు మందు పంపిణీ జరగనుంది. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో జనం హాజరు కానున్నారు. కరోనా నిరోధక మందుగా చెప్పబడుతున్న ఈ నాటు మందులో వాడే పదార్థాలు హాని చేసేవి కావని, ఆయుర్వేదంలో ఉపయోగించేవే అని, కానీ ఈ మందుని ఆయుర్వేద మందుగా పరిగణించలేమని కేంద్ర ఆయుష్ శాఖ వెల్లడి చేసిన సంగతి తెలిసిందే.