కృష్ణపట్నం కరోన మందుకి సంబంధించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మందు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది ఏంటీ అనేది స్పష్టత రావడం లేదు. ఇక కృష్ణపట్నం మందు విషయంలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. పోలీసు వలయంలో బొనిగి ఆనందయ్య ఉన్నారు. కృష్టపట్నం సమీపంలోని గోపాలపురం సీవీఆర్ అకడామీ ఆరవ బ్లాకులో బొనిగి ఆనందయ్య ఉన్నారు.
ఆనందయ్యతో పాటు ఆయన కుమారుడు, సోదరుడి కుమారుడు ఉన్నారు. ఆనందయ్యతో మాట్లాడేందుకు ఎవరికీ పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. సీవీఆర్ అకాడమీలో ఐసీఎంఆర్ పరీక్షల కోసమంటూ మందు తయారీ చేయించి తయారైన మందుని పోలీసులు, వైసీపీ నేతలు తీసుకువెళ్ళారు. ఆనందయ్య మందు పంపిణీ కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. ఓ వైపు కరోనాతో ప్రాణాలు పోతుంటే, ప్రభుత్వం మందు పంపిణీని జాప్యం చేస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.