వాతావరణం మారినప్పుడు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలా రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి. దీనితో వాతావరణం మారిన మీకు ఆరోగ్య సమస్యలు రావు. మన ఒంట్లో 60 శాతం నీరు ఉంటుంది. అది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. వాతావరణం మారితే మీరు లిక్విడ్ కంటెంట్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
ఉదాహరణకు సిట్రస్ ఫ్రూట్స్ తో జ్యూస్ తీసుకోవడం, మష్రూమ్ సూప్, టమట సూప్, వేడి నీళ్లలో పసుపు వేసుకుని తీసుకోవడం, యాలకుల టీ ఇలా కొన్ని రకాల ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండాలి.
రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి విటమిన్ సి చాలా ముఖ్యం. అలానే అది మంచి యాంటీ ఆక్సిడెంట్. అదేవిధంగా విటమిన్ సి ఉన్న కాయగూరలను తీసుకోవడం మంచిది. బ్రోకలీ, కాలిఫ్లవర్ లాంటివి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
వర్షాలు పడుతున్నప్పుడు చేపలని తినడం మంచిది కాదు. కాబట్టి వీలైనంత వరకూ చేపని దూరం పెట్టండి. తింటే అజీర్తి సమస్యలు వస్తాయి గుర్తుంచుకోండి.
వేసవికాలంలో బ్యాక్టీరియా పచ్చి కూరగాయలలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కూరగాయల్ని బాగా కడిగి అప్పుడే వండుకోండి. లేదు అంటే కడుపులో సమస్యలు వస్తాయి.
రాగి, బ్రౌన్ రైస్, ఓట్స్ ఇలాంటివి వాతావరణం మారినప్పుడు తీసుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిలో ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్ ఉంటాయి ఈ విధంగా మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాతావరణం మారినప్పుడు మీకు సమస్యలు రాకుండా ఉంటాయి.