ప్రైవేట్ ఆస్పత్రులకు చుక్కలు చూపించిన గవర్నర్

-

అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై అనంతపురం జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి ఆగ్రహం వ్యక్తం చేసారు. అనంతపురం లో నాలుగు ప్రైవేటు ఆసుపత్రులకు భారీగా జరిమానా విధించారు. ఆశా ఆసుపత్రికి 3 లక్షల జరిమానా, ఎస్వీ ఆసుపత్రికి 2 లక్షల జరిమానా విధించారు. సాయిరత్న ఆసుపత్రికి 2.10 లక్షల జరిమానా విధించగా ఎస్ఆర్ ఆసుపత్రికి 2.55 లక్షల జరిమానా విధించారు.

కోవిడ్ సాకుతో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులపై చర్యలకు దిగారు. అక్రమాలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యల కోసం ఇప్పటికే 256 జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రైవేట్ ఆసుపత్రుల అక్రమాలను సహించేది లేదు, రెండో సారి తప్పు చేసే ఆసుపత్రులపై ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version