తన మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి అంత్యక్రియల నిమిత్తం 14 రోజులు మధ్యంతర బెయిల్పై వెళ్లాడు. ఆ గడువు పూర్తికావడంతో శుక్రవారం తిరిగి జైలుకు వచ్చాడు. ఈ విషయాన్ని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఎస్.రాజారావు తెలిపారు. కోర్టు ఈ నెల 23 వరకు అతని రిమాండ్ పొడిగించింది.
రాజమహేంద్రవరం శివారు ప్రాంతమైన క్వారీ మార్కెట్ కూడలి వరకు ఓ ఎమ్మెల్యే కారులో వచ్చిన అనంతబాబు.. అక్కడి నుంచి మరో వాహనం మారి జైలుకు చేరుకున్నాడు. సంబంధిత ఎమ్మెల్యే ఎస్కార్ట్ కూడా వెంట రావడం గమనార్హం. అప్పటికే జైలు ఆవరణకు అతని అనుచరులు, వైసీపీ మద్దతుదారులు చేరుకున్నారు. అనంతబాబు రాగానే ఆయనతో పాటు రెండో గేటు వరకు వెళ్లారు.