టాలీవుడ్ పై బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సంచలన వ్యాఖ్యలు

-

టాలీవుడ్ సినిమాలు ప్రస్తుతం దేశాన్ని దున్నేస్తున్నాయి. బహుబలి, సాహో, పుష్ప, ట్రిపుల్ ఆర్ ఇలా ఒక్కో సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్నాయి. ఇప్పటికే పుష్ప సినిమా బాలీవుడ్ ఫిలిం మేకర్ల దిమ్మతిరిగేలా వసూళ్లను రాబట్టింది.  బాలీవుడ్ జనాలకు బాహుబలి తెలుగు సినిమా సత్తాను చూపించింది. ఇక ట్రిపుల్ ఆర్ గురించి దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇదిలా ఉంటే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీపై హాట్ హీరోయిన్ అనన్య పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ ఇప్పుడు కేవలం రీజనల్ ఇండస్ట్రీ కాదంటూ..ఈ బాలీవుడ్ భామ ఇంటెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ సినిమాలు కొన్ని హిందీ రాష్ట్రాలకే పరిమితం అవుతున్నాయని.. కానీ తెలుగు సినిమాలు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏలుతున్నాయని చెప్పుకొచ్చింది. పాన్ ఇండియా కింగ్ లా టాలీవుడ్ మారిందన ఈ బ్యూటీ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘ లైగర్’ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్యపాండే హీరోయిన్ గా చేస్తోంది.

చున్నీనే అడ్డుగా అనన్య హాట్ అందాల షో…ఫోటోలు వైరల్…!

Read more RELATED
Recommended to you

Exit mobile version