తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం సహాయాన్ని యాసంగి కాలానికి సంబంధించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా 9,56,731 మంది రైతులకు సహాయం అందింది. దాదాపు రూ.1202,76 కోట్లు రైతులు అకౌంట్లో జమ అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 4,69,696 రైతులు ఉండగా సూర్యాపేట జిల్లాలో 2,61,079 మంది రైతులు, యాదాద్రి జిల్లాలో 2,25956 రైతులకు సహాయం అందింది.