ఏపీలో హై టెన్షన్.. దేవుడి ముందు సత్య ప్రమాణాలు చేయనున్న టీడీపీ, వైసీపీ నేతలు !

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే దేవుడి ముందు సత్య ప్రమాణానికి సిద్దం అయ్యారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లో ఈరోజు టెన్షన్ వాతావరణం నెలకొంది, బిక్కవోలు గణేషుడి ముందు ఈరోజు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఈ రోజు ప్రమాణం చేయనున్నారు..ఈరోజు మధ్యాహ్నం భార్యతో కలిసి వచ్చి ప్రమాణం చేస్తానని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

అదే సమయంలో సత్య ప్రమాణం చేస్తానని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా చెబుతున్నారు. అయితే తనకు పోలీసు రక్షణ కావాలని ఆయన కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే నేతల సత్య ప్రమాణాల ఛాలెంజ్ తో వైసిపి టిడిపి వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా చరిత్రలోనే ఇలా దేవుడి ఎదుట రెండు పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు సత్య ప్రమాణాలు చేయడం మొదటిసారి అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. అనపర్తి నియోజకవర్గం మొత్తం మీద 144 సెక్షన్ విధించి భారీ ఎత్తున పోలీసులు మోహరించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version