జబ్బర్దస్ట్ లేక పోయినా అనసూయ కు డబ్బు లోటు లేదు..!!

-

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్ . ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. అయితే  యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ రేటింగ్స్ కు ఒక కారణం అని చెప్పొచ్చు. వాస్తవానికి అనసూయ కు లైఫ్ ఇచ్చిన షోగా జబర్థస్త్ ను చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ఆమె జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

గుడ్ బై చెప్పిన సందర్భంగా షో పై పలు విమర్శలు చేసింది. బాడీ షేమింగ్‌, వల్గర్‌ కామెంట్లు, వల్ల చాలా భాద పడ్డాను అని చెప్పింది. అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో  `పెట్టిన పోస్టులో నేను దెబ్బతిన్నా, కానీ నేను గాయపడిన విధంగా ఎవరినీ బాధ పెట్టను` అని రాసుకోచ్చింది. ఇది ఖచ్చితంగా హైపర్ ఆది మరియు మల్లె మాల ప్రొడక్షన్ ను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేసినట్లు గా కనపడింది.

ప్రస్తుతానికైతే పుష్ప 2,  మైఖేల్ మరికొన్ని సినిమాలలో నటిస్తూ ఉంది. అలాగే షాప్స్ ఓపెనింగ్స్ కు వెళుతూ ఆదాయం కు లోటు లేకుండా చూసుకుంటు వుంది. ఇంకా చెప్పాలి అంటే జబ్బర్థస్ట్ కంటే ఎక్కువగా సంపాదిస్తూ ఉంది. ఒక్కో షాప్ కటింగ్ కు 3 నుండి 5లక్షలు దాకా వసూలు చేస్తోంది.ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఆమె  నిజామాబాద్ లో ఓ బట్టల షోరూమ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంది. బ్లూ కలర్ శారీలో  వెనక మొత్తం కనిపించేలా చుపిస్తూ  అందాలు ఆరబోసింది.

Read more RELATED
Recommended to you

Latest news