డబ్బు, స్టేటస్ గురించి నోరు విప్పిన అనసూయ..!

-

జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ను యాంకర్ గా మొదలుపెట్టి.. అనతి కాలంలోనే స్టార్ యాంకర్ గా.. బ్యూటీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఒకవైపు బుల్లితెర షోలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈమె ఆ క్రేజ్ తో సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకొని.. స్టార్ హీరోయిన్ రేంజ్ లో స్టార్డం సొంతం చేసుకుంది. చేసేది క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలైనా సరే.. హీరోయిన్ ను మించీ ప్రాధాన్యం ఉన్న పాత్రలు సెలెక్ట్ చేసుకోవడంలో ఈమె దిట్ట. అందుకే రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్ప లో దాక్షాయినిగా నటించి తన నటనకు ఎవరు సాటిరారు అని నిరూపించుకుంది.

ఇప్పటికీ కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడమే కాదు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా పెట్టిన ఒక పోస్టు మరింత వైరల్ గా మారుతుంది..” డబ్బు, హోదా నిజమైన అభివృద్ధి కాదు.. నీవు ఆలోచించే విధానం .. విషయాలను అర్థం చేసుకునే తీరు ఉన్నతంగా ఉంటే అదే నిజమైన అభివృద్ధి.. అది నీలోనే ఉంది.. కానీ నువ్వు దానిని గుర్తించాలి” అంటూ అనసూయ పోస్ట్ చేసింది.

ఇకపోతే పోస్టుతో పాటు శారీ కట్టి మత్తెక్కించే చూపులతో కుర్ర కారును మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అనసూయ ఎంత అందంగా ఉంటుందో అంత చలాకిగా కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా ప్రస్తుతం బుల్లితెర వదిలిపెట్టి వెండితెరపై బిజీగా ఉన్న ఈమె మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version