ఓమైగాడ్.. అనసూయ..నువ్వేనా? యాపిల్ తోటలో అనసూయ.. ట్రెండింగ్ ఫోటోలు

-

సూయ.. సూయ.. సూయ.. సూయ.. సూయ.. అట్లా ఎట్టా పుట్టేశావే నువ్వు అనసూయ.. అని మీరు పాడుకుంటారు ఈ ఫోటోలు చూస్తే.. అవును.. జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇటీవలే యూఎస్‌కు తన ఫ్యామిలీతో కలిసి వెళ్లింది. తానా ఉత్సవాల కోసం తన భర్త, ఇద్దరు కొడుకులతో అమెరికా వెళ్లినప్పుడు ఫ్రీ సమయం దొరకడంతో.. హాలీడే టూర్ వేసిన అను.. అక్కడ ఉన్న యాపిల్ తోటలో మెరిసింది.

ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఇట్టే పట్టేసుకోవడంలో అనసూయ నెంబర్ వన్. తను రెగ్యులర్‌గా ఫోటోషూట్‌లలో పాల్గొని ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా అనసూయ.. పండ్ల తోటల్లో తన భర్త, కొడుకులతో కలిసి మెరిసిన ఫోటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్నాయి. యాపిల్, బెర్రీ, ద్రాక్ష తోటల్లో పండు ఏరుతూ.. వాటిని టేస్ట్ చేస్తూ అను.. తెగ ఎంజాయ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news