మరోసారి మానవత్వం చాటుకున్న ప్రదీప్..!

-

ప్రదీప్ మాచిరాజు.. అసలు పరిచయం అక్కర్లేని పేరు. టీవీ యాంకర్‌గా పరిచయమై తనశైలిలో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఒకపక్క యాంకరింగ్, మరోపక్క సినిమాలతో నిరంతరం బిజీ బిజీగా ఉండే ప్రదీప్.. తాజాగా.. ఓ విద్యార్థి పట్ల ఔదార్యం ప్రదర్శించాడు. తన చదువులకు అవసరమైన ఫీజులు చెల్లించలేకున్నానని, పుస్తకాలు కూడా కొనలేకున్నానని బాలరాజు అనే ఓ విద్యార్థి అర్థించగా, ప్రదీప్ వెంటనే సాయం చేశాడు.

ఆ విద్యార్థి ఉన్నత చదువులకు అయ్యే ఫీజు రూ.10 వేలు కట్టడమే కాకుండా ఈకామర్స్ పోర్టల్ లో పుస్తకాలు ఆర్డర్ చేసి, సెప్టెంబరు 11 నాటికి అవి తనకు అందుతాయని బాలరాజుకు తెలిపాడు. అలాగే ఇంతకుముందు కూడా కరోనా దెబ్బతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న తనకు తెలిసిన ఓ 60 కుటుంబాలకు నెలకు సరిపడ సరుకులు అందించాడు ప్రదీప్.

Read more RELATED
Recommended to you

Exit mobile version