పెళ్లిపై యాంకర్​ రష్మి క్లారిటీ.. వచ్చే నెలలోనే అంట.. కానీ..

-

జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్​గా కెరీర్ ప్రారంభించి యూత్​లో క్రేజ్​ సంపాదించుకుంది రష్మి. అలానే అవకాశం దొరికినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొత్తంగా తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. స్టేజిపై గ్లామర్ ఒలికిస్తూ సూపర్​ ఫ్యాన్ ఫాలోయింగ్​ను పెంచుకుంది.

అయితే బుల్లితెరపై రష్మీ-సుడిగాలి సుధీర్ జోడీకి మంచి క్రేజ్​ ఉంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరూ వారిని కొట్టిపారేశారు. కొంతకాలంగా ఎవరి షోస్ వారే చేస్తుకుంటూ.. ఇద్దరు కలిసి పెద్దగా కనిపించడం లేదు.

అయితే తాజాగా రష్మి తన పెళ్లి కబురు చెప్పి సర్​ప్రైజ్​ చేసింది. ఈ విషయాన్ని ఎక్స్​ట్రా జబర్దస్త్​ కార్యక్రమంలో చెప్పింది.ఎక్స్​ట్రా జబర్దస్త్​ షోకు సీనియర్​ నటులు ఖుష్బూ, ఇంద్రజ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను చేసిన లేటెస్ట్ స్కిట్​లో రష్మీ తన పెళ్లి వార్తను బయటపెట్టింది. ‘రష్మీ త్వరగా పెళ్లి చేసుకో వయసు అయిపోతుంది కదా?’ అనగానే.. “అన్నట్టు వచ్చే నెల నా పెళ్లి. దసరా ఈవెంట్ ఉంది కదా.. అందులోనే. నా పెళ్లి ఈవెంట్స్​లోనే జరుగుతుంది.. బయటకాదు” అని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version