ఉద్యోగార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. మరో 1540 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏఈఈ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ విభాగాల్లో 1,540 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈనెల 22 నుంచి అక్టోబర్ 14వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు పేర్కొంది.
మరోవైపు రవాణా శాఖలో అసిస్టెంట మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులకు హెవీ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై పలు అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అర్హతల విషయంలోనూ పలు విజ్ఞప్తులు వచ్చాయని.. వాటిని రవాణా శాఖకు తెలియజేసినట్లు చెప్పింది. 113 ఏఎంవీ పోస్టు భర్తీకి జులై 27 టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.