Vishnupriya : యాంకర్ విష్ణుప్రియ Facebook ఖాతాలో అశ్లీల వీడియోలు

-

యాంకర్ విష్ణుప్రియ ఈటీవీలో  పోవే పోరా అనే కార్యక్రమం ద్వారా ఈ బ్యూటీ క్రేజ్ సంపాదించుకుంది. ఈ షో ద్వారా నెమ్మదిగా ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీ సినిమాలు, సిరీస్​లలో అవకాశాలు దక్కించుకుంది. రీసెంట్​గా వచ్చిన ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ సినిమాలో అందాలు ఆరబోసి హాట్ టాపిక్ అయింది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. తన ఇన్​స్టా, ఫేస్​బుక్​లలో ఈ భామ ఫొటోలు చూసి కుర్రకారు మతిచెడిపోతోంది. ఈ భామకు సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. అందుకే ఈమె ఫేస్ బుక్ ఖాతాలో 3.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

మొన్నామధ్య తన ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయినట్టు చెప్పుకొచ్చిన విష్ణు ప్రియ. తన ఫేస్ బుక్ పేజీలో అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్ట్ అవుతున్నాయని దయచేసి కొన్ని రోజులు తనని అన్ ఫాలో చేయమని చెప్పుకొచ్చింది. కొన్నిరోజుల తర్వాత అంతా సెట్ అయిందనుకుంటే మళ్లీ రీసెంట్​గా ఈ బ్యూటీ ఫేస్​బుక్ ఖాతా హ్యాక్ అయిందట. విష్ణుప్రియ ఫేస్​బుక్ అకౌంట్​లో అశ్లీల వీడియోలు కనిపిస్తున్నాయట. ఆ వీడియోలు చూసి ఆమె బంధువులు, స్నేహితులు ఆమెకు తెగ ఫోన్లు చేస్తున్నారట.

“చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ నాకు కాల్ చేసి మరీ నీ ఫేస్​బుక్​లో ఆ వీడియోలేంటి ఆ కంటెంట్ ఏంటని అంటున్నారు. అవి నేను పోస్ట్ చేసినవి కావు. వాటికి నాకు ఎంత మాత్రం సంబంధం లేదు…” అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.

Read more RELATED
Recommended to you

Exit mobile version