ఆంధ్ర ప్ర‌దేశ్ బ‌డ్జెట్ : రూ. 2.30 ల‌క్షల కోట్ల‌తో బ‌డ్జెట్ రెడీ!

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. కాగ తొలి రోజు గ‌వ‌ర్న‌ర్ విశ్వ భూషన్ హ‌రి చంద‌న్ ప్ర‌సంగం ఉంటుంది. అలాగే 8 వ తేదీని దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి కి అసెంబ్లీ, మండ‌లి సంతాపం ప్ర‌క‌టిస్తాయి. అలాగే 9, 10 తేదీల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాల తీర్మానం పై చ‌ర్చ జ‌రుగుతుంది. అలాగే ఈ నెల 11 వ తేదీని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను.. బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెడుతారు.

కాగ గ‌త ఆర్థిక సంవ‌త్సరం వైసీపీ ప్ర‌భుత్వం.. రూ. 2.29 ల‌క్షల కోట్ల అంచ‌నాతో బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టింది. కాగ ఈ ఏడాది రూ. 2.30 ల‌క్షల కోట్ల నుంచి రూ. 2.40 ల‌క్షల కోట్ల అంచ‌నాతో బడ్జెట్ ను ప్ర‌వేశ పెట్టే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ క‌స‌రత్తులు చేసింది. బ‌డ్జెట్ ను కూడా సిద్ధం చేసింది.

కాగ రాష్ట్ర ప్ర‌జల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా బ‌డ్జెట్ ను రాష్ట్ర ప్ర‌భుత్వం రూపొందించింది. కాగ ఈ సారి ప‌లు ప‌థ‌కాల కోసం నిధులు కేటాయించే అవ‌కాశం ఉంది. అయితే ప్ర‌స్తుతం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా పేద ప్ర‌జ‌ల‌కు నిరాశ ఎదురుఅయ్యే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version