మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ నజీర్ తన తొలి ప్రసంగాన్ని పూర్తి చేశారు. అయితే గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు ఏంటంటే..
* అమ్మ ఒడి పథకం ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం.
* 2024 నాటికి అర్హులైన ప్రజలకు శాశ్వత గృహాలు
* వైద్య శాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్ కార్డులు
* నేతన్న నేస్తం కింద నేత కార్మికులకు ఏడాదికి 24 వేల ఆర్థిక సాయం
* జగనన్న చేదోడు ద్వారా 3.36 లక్షల మందికి 927,49 కోట్లు
* రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు.
* విద్యార్థులకు 690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్ ల పంపిణీ
* జగనన్న గోరుముద్దతో 43.26 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
* వైయస్సార్ బీమా కింద రెండేళ్లలో 512 కోట్లు జమ
* వైయస్సార్ జగనన్న కాలనీలో పేదలకు ఇల్లు
* పీహెచ్సీలలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు