వేసవిలో గర్భిణీలు తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!

-

గర్భిణీలు 9 నెలలు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి అటువంటప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. వేసవిలో వేడి గాలుల వల్ల తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భిణీ స్త్రీలు వేసవి తాపంతో అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి సమయంలో ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. గర్భిణీలు వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా వీటిని అనుసరించాల్సిందే.

గర్భిణీలు వేసవిలో ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండాలి డిహైడ్రేషన్ సమస్య అప్పుడు రాదు. కనీసం రోజుకి మూడు లీటర్ల దాకా నీళ్లు తీసుకుంటూ ఉండండి. అలానే పండ్ల రసాలు, కొబ్బరినీళ్ళని కూడా గర్భిణీలు తీసుకుంటే మంచిది. శరీరాన్ని చల్లగా మార్చుకోవడానికి స్విమ్మింగ్ చేస్తే కూడా మంచిదే శరీరానికి కావాల్సిన వ్యాయామం కూడా దీనివల్ల అందుతుంది.

పోషక పదార్థాలతో నిండిన ఆహారాన్ని తీసుకుంటే కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆకుకూరలు, కూరగాయలు, గింజలు, పెరుగు వంటివి తీసుకుంటూ ఉండండి ఇవి మీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. గర్భిణీలు వ్యాయామం చేస్తే కూడా మంచిదే. వేసవి కాలంలో ఉదయం సాయంత్రం కాకుండా ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత కాసేపు వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది.

ఎక్కువగా గర్భిణీలు పాదాల్లో నీళ్లు చేరిపోతూ ఉంటాయి. నీళ్లు చేరకుండా ఉండాలంటే పాదాలని కాస్త ఎత్తులో ఉంచుకోవాలి అప్పుడు వాపు నీరు పట్టడం వంటివి ఉండవు. సౌకర్యంగా ఉండే దుస్తులు ధరిస్తే మంచిది. వీలైనంత వరకు కాటన్ బట్టలు వేసుకోండి. గర్భిణీలు మధ్యాహ్నం కాసేపు నిద్రపోతే కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి కాసేపు విశ్రాంతి తీసుకోండి బయటకు వెళ్లకుండా చూసుకోండి ఒకవేళ బయటకు వెళ్తే సన్ గ్లాసెస్ వంటివి ధరించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version