NDA కన్వీనర్ గా చంద్రబాబు..?

-

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నిన్న, మొన్నటి వరకు కాస్త ఉత్కంఠగానే కొనసాగాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా అధికంగా కూటమి గెలుస్తుందని చెప్పినప్పటికీ.. కొన్ని సర్వేలు మాత్రం వైసీపీ కి అనుకూలంగా ఫలితాలు ఇవ్వడంతో ఏపీలో ఎవ్వరూ గెలుస్తారని ఉత్కంఠ నెలకొంది. చివరికీ టీడీపీ 133 స్థానాలు, జనసేన 20, వైసీపీ 14, బీజేపీ 07 స్థానాల్లో గెలిచింది.

Narendra Modi gave special congratulations to Chandrababu

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. ఆయనను ఎన్డీఏ కన్వీనర్ గా నియమించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఆ పార్టీకి సీట్లు తగ్గడంతో చంద్రబాబు మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ లో చెప్పినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version