అతని పై విమర్శలు చేసి నా స్థాయిని తగ్గించుకోను : సుజనా చౌదరి

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. అధికార వైసీపీ నేతలు.. ప్రతిపక్ష టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి నేతలు విమర్శించుకుంటున్న విషయం తెలిసిందే. నిత్యం వీరి మద్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఒకరిపై మరొకరూ విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా వైసీపీ నేతలపై బీజేపీ ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.

కేశినేని నాని స్థాయికి తాను దిగజారలేనని అన్నారు. ఎప్పుడూ ప్రత్యర్థులపై కామెంట్ చేయను అని తెలిపారు. ‘ఎన్నికల సమయంలో అసంతృప్తులు సహజం. నేను విజయవాడ దుర్గమ్మ ఆలయంలోనే పుట్టాను. విజయవాడకు నేను చేయగలిగేది చేస్తా’ అని హామీ ఇచ్చారు. కాగా, వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో బరిలో ఉండనుంది. ఇప్పటికే అభ్యర్థులను సైతం ప్రకటించింది. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి లోక్సభ బరిలో పోటీకి దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version