పెన్షన్లు పంపిణీ చేయవద్దని టీడీపీ ఎవ్వరినీ కోరలేదు : చంద్రబాబు

-

ఏపీలో పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, లబ్ధిదారులకు పెన్షన్లు అందేలా చూడాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని కారణంగా పెన్షన్ల పంపిణీ నిలిచిపోకూడదన్నారు. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులు కేటాయించి పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. వాలంటీర్ల ద్వారా పింఛను పంపిణీ నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చినందున వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.

లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే పింఛన్లు పంపిణీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. పెన్షన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒకటో తేదీన పింఛన్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం అయింది. దీంతో ఆ నెపాన్ని టీడీపీ, ఎన్నికల సంఘంపై నెడుతున్నారు. పెన్షన్లు పంపిణీ చేయొద్దని టీడీపీ ఎవరినీ కోరలేదు. వైసీపీ కుట్రలను ఇంటింటికి వెళ్లి తెలియజేయాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. ఖజానా ఖాళీ చేసి పెన్షన్లు ఇవ్వలేని స్థితికి ప్రభుత్వన్ని తీసుకొచ్చారని నారా చంద్రబాబు విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version