ఒకరిది సక్రమ పొత్తు.. మరొకరిది అక్రమ పొత్తు : షర్మిల

-

తెలుగుదేశం పార్టీకి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరికీ ఓటు వేసినా భారతీయ జనతా పార్టీకే ఓటు వేసినట్టు అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఏపీ న్యాయ్ యాత్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడలో సోమవారం నిర్వహించిన రోడ్డు షోలో పాల్గొన్నారు షర్మిల. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకరు బీజేపీతో సక్రమ పొత్తులో ఉండగా.. మరొకరూ అక్రమ పొత్తులో ఉన్నారని విమర్శించారు.

ఈ పదేళ్లలో దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనిపించలేదన్నారు. మన పిల్లలకు ఉద్యోగాలు లేవని.. కార్మికులకు ఉపాధి కరువు అయిందని పేర్కొన్నారు. వైసీపీకి ఓటు వేసినా.. టీడీపీకి ఓటు వేసినా మనకు న్యాయం జరగదన్నారు. రెండు పార్టీలు బీజేపీతో పొత్తులున్నాయని.. మళ్లీ రాజశేఖర్ రెడ్డి సంక్షేమం రావాలంటే.. హస్తం గుర్తుకే ఓటు వేయాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా.. పోలవరం ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి కావాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version