టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆస్తులు రూ.5, 785 కోట్లు

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ కూడా జరిగింది. రెండో దశ కూడా త్వరలోనే జరుగనుంది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో దశలో మే 13న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. నామినేషన్లు దాఖలు చేేసేందుకు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఏపీలో పలువురు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీ, రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాలకు పలువురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల ఆస్తులకు సంబంధించి పలు విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలుస్తున్నారు. తన కుటుంబానికి రూ.5,785.28 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. అందులో చరాస్తుల విలువ రూ. 5,598.65  కోట్లు కాగా.. స్థిరాస్తులు రూ.186.63 కోట్లు ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలాగే అప్పులు రూ.1,038 కోట్లు ఉన్నట్టు తెలిపారు. డాక్టర్ అయిన చంద్రశేఖర్ అమెరికాలో వైద్య వృత్తితో పాటు వివిధ వ్యాపారాల్లో సక్సెస్ సాధించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version