ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజాగా 2024 ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. తాడేపల్లిలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న కీలక అంశాల గురించి వివరించారు జగన్.
ముఖ్యంగా విద్య, అమ్మవడి, ట్యాబ్, సున్నా వడ్డి, వైద్యం, ఆరోగ్య శ్రీ, విలేజీ క్లినిక్, 17 కొత్త మెడికల్ కళాశాలు, వ్యవసాయం, రైతు భరోసా, పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్, ఉన్నత విద్య, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, నాడు నేడు, స్కూల్స్, పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలాలు, మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, సామాజిక భద్రత, పెన్షన్ కానుక, రెండు విడుతల్లో రూ.3500 పెంపు, పెన్షన్ల పంపిణీ, మౌలిక వసతులు, సుపరిపాలన, వైఎస్సార్ చేయూత, కళ్యాణ మస్తు, షాదీ తోఫా, వంటి వాటి గురించి వివరించారు. గతంలో అమలు చేసిన వాటి గురించి తాజాగా మార్పులను పెంచేవిధంగా చూస్తామని హామి ఇచ్చారు.