అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. గవర్నర్ ప్రసంగం కాస్త ఇరుపార్టీల మధ్య వాగ్వాదానికి దారితీసినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు ఆ పార్టీని చిత్తుగా ఓడించినా అందులోని కొందరికి అహకారం ఏమాత్రం తగ్గలేదన్నారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడుతూ..దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ పార్టీకి గౌరవం లేదన్నారు.స్పీకర్ చైర్‌ను పట్టుకుని నువ్వు అని సంభోధించడం సభా సంప్రదాయాలను మంటగలపడమేనని విమర్శించారు.స్పీకర్ దళిత జాతికి చెందిన వ్యక్తి కావడంతోనే అలా ఏకవచనంతో సంభోధిస్తున్నారని మండిపడ్డారు.బీఆర్ఎస్ అగ్ర నాయకులతో సహా ఆ పార్టీలో ఉన్న ప్రతినేతకూ మహిళా రాష్ట్రపతి అంటే కూడా గౌరవం లేదని, అందరి పట్ల చులకన చేయడం వారికి అలవాటైందని ఫైర్ అయ్యారు.