పెళ్లయిన వారానికే ప్రియుడితో పెళ్లికూతురు జంప్

-

పెళ్లయిన వారానికే తన ప్రియుడితో కలిసి పెళ్లికూతురు వెళ్లిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..రంగారెడ్డి జిల్లాలో కుటుంబ సభ్యులు వధువుకు ఇష్టం లేని పెళ్లి చేశారని సమాచారం.

అయితే, ఈ విషయాన్ని పెళ్ళికొడుకు శివరామకృష్ణకు ఆ పెళ్లికూతురు ముందే చెప్పినట్లు తెలిపింది.నిశ్చితార్థం తర్వాత కుటుంబ సభ్యులు తనను ఇబ్బందులకు గురి చేశారని తెలిపిన వధువు.. తన ప్రియుడు అరవింద్‌తో ఇష్ట పూర్వకంగానే వెళ్ళిపోయినట్లు నవవధువు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం కనిపించకుండా పోయిన పెళ్లికూతురు కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version