ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని టీడీపీ నేత నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇంటి పన్ను తగ్గిస్తామన్నారు. అలాగే నిర్మాణ రంగానికి అతిపెద్ద సమస్యగా మారిన ఇసుకపై.. పాత విధానాన్ని తీసుకొస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
దీంతో పాటుగా అక్రమాలకు పాల్పడుతున్న మైనింగ్ విభాగంపై విచారణ కమిటీ వేస్తామని, వ్యవసాయ ఆధారిత ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని లోకేష్ చెప్పుకొచ్చారు. అలాగే మాయ మాటలతో అధికారంలో వచ్చిన వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని.. జగన్ ఐదేళ్ల పాలనలో.. తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని ఆరోపణలు చేశారు..