Andhra Pradesh:ఫించన్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

-

ఆగస్టు నెల పెన్షన్ పంపిణీపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో లాగే ఆగస్టు నెలలో కూడా ఒకటో తేదీ ఉదయం 6గంటల నుండే పెన్షన్ పంపిణీ చేయాలని ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొదటిరోజునే 99శాతం పెన్షన్ పంపిణీ పూర్తవ్వాలని ఆదేశించింది. ఏదైనా కారణాల చేత పెన్షన్ అందని వారికి మరుసటిరోజు పంపిణీ చేయాలని పేర్కొంది. 31వ తేదీ నాడే బ్యాంకుల నుండి పెన్షన్ కి సంబందించిన డబ్బు డ్రా చేయాలని తెలిపింది.

పింఛన్ పంపిణీలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కఠినచర్యలు తప్పకుండా ఉంటాయని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా, లబ్ధిదారులంతా ఆగస్టు ఒకటవ తేదీ నాటికి తమ స్వగ్రామాల్లో ఉండాలని సెర్ప్ సీఈవో ఈ మేరకు కీలక సూచనలు చేశారు. పింఛన్లు పంపిణీ కోసం నియమించబడిన సిబ్బంది ఆగస్టు 1వ తేదీన 6గంటలకే పంపిణీని ప్రారంభిస్తారని వెల్లడించారు.మొదటి రెండు రోజుల పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాలలో ప్రజలందరికీ తెలియజేయాలని.. ప్రతి లబ్ధిదారునికి సమాచారం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version