పార్టీల గలీజ్ భాష :: ఆంధ్ర జనం అవాక్కవుతున్నారు..!!

-

కరోనా వైరస్ వల్ల ప్రజలు చనిపోతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు మాత్రం ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా రాజకీయాలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అయినా అదేవిధంగా మిగతా పార్టీలు అయినా ఎక్కడా తగ్గడం లేదు. దేశంలో మిగతా రాష్ట్రాలలో అధికార ప్రతిపక్షాలు కరోనా వైరస్ పై పోరాడుతుంటే మాత్రం, ఏపీలో రాజకీయ నాయకులు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. మరి అసభ్యకరమైన పదజాలంతో రాజకీయ నాయకులు అని వ్యవహరించకుండా రోడ్డు మీద పొగాకు నమిలే చదువు లేని వ్యక్తి లాగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో గలీజ్ భాష తో పెడుతున్న కామెంట్ల పై ఏపీ జనాలు అవాక్కవుతున్నారు. ఇలాంటి వాడు పార్లమెంటులో ఉండి రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాడతాడు అంటూ మండిపడుతున్నారు.

 

అదేవిధంగా విజయసాయిరెడ్డి పై బిజెపి పార్టీ కూడా సోషల్ మీడియాలో దొంగ, గజదొంగ, జైలు పక్షి వంటి పోస్టులు పెట్టడం తో… నిజంగా విజయసాయిరెడ్డి అలాంటి వాడయితే కేంద్రంలో ఉన్నది మీరే కదా అతన్ని జైల్లో పెట్టండి అంటూ ఏపీ ప్రజలు సవాలు విసురుతున్నారు. కరోనా వైరస్ రాష్ట్రంలో ఉన్న కొద్దీ విజృంభిస్తుంటే.. వైరస్ కట్టడి చేయడంపై దృష్టి పెట్టకుండా లాక్ డౌన్ టైం లో ఈ బూతు పార్టీల రాజకీయం ఏంటో మాకు అర్థం కావటం లేదు అని ఏపీ జనాలు గగ్గోలు పెడుతున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version