ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..2588 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ

-

ఏపీ నిరుద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అదిరిపోయే శుభ వార్త చెప్పింది. వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఏకంగా 2588 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 446 ఏంటి సర్జన్ పోస్టులు కాగా 6 డిప్యూటీ డెంటల్ సర్జన్ పోస్టులను శాశ్వత విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుని జగన్ సర్కార్.

అలాగే 57 స్టాఫ్ నర్సులు, 74 ఫార్మాసిస్ట్, 235 ల్యాబ్ టెక్నీషియన్లు అలాగే 74 మెడికల్ ఇంజనీరింగ్ జాబ్స్ ను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాలని జగన్ మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. అటు 279 థియేటర్ అసిస్టెంట్, 684 జనరల్ డ్యూటీ అటెండెన్స్ తదితర పోస్టులను అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఈ పోస్టులను తొందరగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తిచేయాలని…గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యుల‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version