రాముడికి రామాయణం లో ఎంత ప్రాముఖ్యత ఉందో హనుమంతు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. చాలా మంది హనుమంతుడికి కూడా పూజిస్తారు. ప్రత్యేకించి మంగళవారం నాడు హనుమంతుడిని పూజిస్తూ కూడా వుంటారు. హనుమంతుడికి తమలపాకులు అంటే ఎంతో ప్రీతి. అయితే హనుమంతుడిని పూజించేటప్పుడు ఎలా పడితే అలా పూజించకూడదు. దానికి కూడా కొన్ని ఆచారాలు, నియమాలు ఉన్నాయి. మరి వాటి కోసం చూద్దాం.
హనుమంతుడిని పూజించేటప్పుడు ప్రదక్షిణాలు చేసేటప్పుడు కేవలం మూడు ప్రదక్షిణలతో ఆపకూడదు. ఐదు ప్రదక్షిణాలు చేయాలి. హనుమంతుడికి ప్రదక్షిణాలు చేసి జై హనుమాన్ జై హనుమాన్ అని చదివితే సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగి పోతాయి.
అలాగే భక్తులు ఏమైనా హనుమంతుడికి సమర్పించాలి అంటే పూజారి గారి చేతుల మీదగానే ఇవ్వాలి. ఆడ వారు అయితే అసలు హనుమంతుని తాకకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం లో ఉంటారు కాబట్టి ఆడవారు ఆంజనేయ స్వామిని తాకకూడదు దూరంగా ఉండి మాత్రమే మొక్కాలి. ఇలా హనుమంతుడిని పూజించేటప్పుడు కచ్చితంగా ఈ నియమాలను అనుసరించాలి.