ఆంధ్ర ప్రదేశ్ లో ‘స్వచ్ఛ సర్వేక్షణ్​’ అవార్డుల హవా… టాప్ నగరాలు ఇవే..!

-

స్వచ్ఛ సర్వేక్షణ్​’ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన విజయవాడకు అత్యంత పరిశుభ్రమైన పెద్ద నగరంగా అవార్డు లభించింది. మిలియన్ జనాభా దాటిన నగరాల జాబితాలో జాతీయ స్థాయిలో 4 స్థానంలో నిలిచింది. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది, అధికారుల సమష్టి కృషి, నగర ప్రజల సహకారంతోనే నాలుగో స్థానం సాధించామని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ సంతోషం వ్యక్తం చేశారు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్​’ కార్యక్రమంలో భాగంగా 2020కి గాను పరిశుభ్రత అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 129 అవార్డులను అగ్రశ్రేణి నగరాలు, రాష్ట్రాలకు అవార్డులు కైవసం చేసుకున్నాయి. దేశవ్యాప్త వార్షిక పరిశుభ్రత సర్వే ఐదో ఎడిషన్​ ఫలితాలు ఇవి. దేశంలోని 4,242 పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డుల్లోని 1.87 కోట్ల మంది పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు.

ap swachh

25వేల నుంచి 50వేల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో పుట్టపర్తి కి 2 వ ర్యాంకు, జమ్మలమడుగు నగరానికి 5 వ ర్యాంకు, నిడదవోలు నగరానికి 6 వ ర్యాంకు, రామచంద్రపురం నగరానికి 7 వ ర్యాంకు లభించాయి.నగరంలో చెత్త నిర్వహణ, శుద్ధి చేయడం, మురుగు నీటి నిర్వహణ, బయోవ్యర్ధాల నిర్వహణ, డంపింగ్‌యార్డు, రహదారుల శుభ్రత తదితర అనేక అంశాలపై నిత్యం ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్‌ రహిత నగరంగా మార్చామని…. ప్లాస్టిక్‌ నిషేదం అమలు చేయడానికి చేపట్టిన అనేక పద్దతులు కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో నగరంలో అందమైన పార్కులు తయారు చేయబోతున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version