నరసరావుపేట ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

-

ఏపీలో మరో ఎమ్మెల్యే కరోన బారిన పడ్డారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గోపిరెడ్డి తానే స్వయంగా ప్రకటించారు. ప్రజలు ఎవ్వరూ అధైర్యపడవద్దని త్వరలోనే ఆరోగ్యం మీ ముందుకు వస్తానని ఆయన పేర్కొన్నారు. తాను హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నానని నెగిటివ్ వచ్చే వరకు నన్ను ఎవరూ సంప్రదించవద్దని ఆయన ప్రకటనలో కోరారు.

అలానే స్దానిక నేతలు, అధికారుల సహాయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అంతే కాక గత నాలుగైదు రోజుల నుంచి నన్ను కలిసిన వారు కూడా కోవిడ్ పరిక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మరణాలు కూడా రోజూ వందకు దగ్గరలో నమోదు కావడం కొంచెం ఆందోళన కలిగిస్తోంది. కేసులు కూడా రోజూ దగ్గర దగ్గరగా పది వేల దాకా నమోదవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version