టీడీపీ అన్నా చంద్రబాబు అన్నా ఇంతెత్తున మండిపడే విజయసాయి రెడ్డి తాజగా మరో సారి చంద్రబాబు మీద విరుచుకు పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో విమర్శలు చేశారు. “వెన్నుపోటుకు 23 ఏళ్ళు, 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్తాపకులు ఎన్టీఆర్ గారిని చంద్రబాబు & కో వెన్నుపోటు పొడిచి, పార్టీ నుంచి ఆయన్ని బహిష్కరించి, పార్టీ పగ్గాలు లాక్కుని, ఎన్టీఆర్ గారిని అవమానించారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ గారి మీద సస్పెన్షన్ ఎత్తేస్తారేమో చూడాలి. ” అంటూ కామెంట్ చేశారు.
ఇక జగన్ గారి పాలనపై ప్రకృతి వరాల జల్లు కురిపిస్తోందని వరుసగా రెండో ఏడాది నిండిన నాగార్జున సాగర్, శ్రీశైలం. నిండు కుండల్లా జలాశయాలు – పరవళ్లు తొక్కుతున్న నదీ నదాలు. రాష్ట్రంలో సంతోషాల పంటతో చంద్రబాబుకు మాత్రం కడుపు మంట పెరిగిందని ఆయన ట్వీట్ చేశారు. ఇక ఏపీలో భారీ వర్షాల వలన నదులూ, వాగులు వంకలు పొంగి పొర్లుతున్న సంగతి తెలిసిందే.
వెన్నుపోటుకు 23 ఏళ్ళు.
23 సంవత్సరాల క్రితం ఇదే రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్తాపకులు ఎన్టీఆర్ గారిని @ncbn & కో వెన్నుపోటు పొడిచి, పార్టీ నుంచి ఆయన్ని బహిష్కరించి, పార్టీ పగ్గాలు లాక్కుని, ఎన్టీఆర్ గారిని అవమానించారు.
ఇప్పటికైనా ఎన్టీఆర్ గారి మీద సస్పెన్షన్ ఎత్తేస్తారేమో చూడాలి.— Vijayasai Reddy V (@VSReddy_MP) August 23, 2020